నగర పరిశుభ్రతపై ప్రభుత్వ చీఫ్ విప్ ఫోకస్

వరంగల్ అర్బన్ జిల్లా : ఓ వైపు ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలను తీర్చడమే కాకుండా, నగర పరిశుభ్రతపై ఫోకస్ పెడతాడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే , ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. నిత్యం ప్రజల మధ్య పర్యటిస్తూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో ముందుంటాడు. ఇక పరిసరాల పరిశుభ్రతే – ప్రజల ఆరోగ్యానికి శ్రీరామ రక్షగా నగర సుందరీకరణలో ఓ కన్నేస్తాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నగర సుందరీకరణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర మరువలేనిదని చెప్పవచ్చు. కరోనా సమయంలోనూ ఫ్రంట్ వారియర్స్ గా పరిసరాల పరిశుభ్రతను ఏర్పరిచి , ప్రజల ఆరోగ్యానికి శ్రీరామ రక్షగా నిలిచారు. అలాంటి పారిశుద్ధ్య కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది.

ads

ఇందులో భాగంగానే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే , ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ బుధవారం తెల్లవారు జామున తన నియోజకవర్గంలో సైకిల్ పై పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని పలు కాలనీల్లో సైకిల్ పై పర్యటించి పారిశుద్ధ్య కార్మికుల పనితీరుని పరిశీలించారు. ప్లాస్టిక్ మరియు కాలుష్య రహిత నగరంగా గ్రేటర్ వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దేందుకై సైకిల్ ఫర్ చేంజ్ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇందులో భాగంగానే డిప్యూటీ మేయర్ కాజా సిరాజుద్దీన్ తో కలిసి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దాస్యం వినయ్ భాస్కర్ సైకిల్ పై పర్యటించారు. పారిశుద్ధ్య పనులు పరిశీలిస్తూ, కార్మికులతో మాట్లాడారు. నగరాభివృద్ధిలో, నగరాన్ని సుందరీకరణంగా చూపించడంలో మీ పాత్ర మరువ లేనిదంటూ పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కొనియాడారు. అనంతరం వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం అయ్యే దిశగా ప్రభుత్వంతో మాట్లాడతానని పారిశుద్ధ్య కార్మికులకు దాస్యం వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు.