మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

సిద్దిపేటజిల్లా : మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణే అని ఆర్థిక మంత్రి హరీశ్​రావు అన్నారు. రాష్ట్రంలో తొలి సారి మహిళా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా సీఎం కేసీఆర్​దే అని కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళ సోదరీ మణులకు మంత్రి హరీష్ రావు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ads

ఒక సమాజ వికాసానికి నిజమైన కొలమానం. ఆ సమాజంలోని మహిళాభివృద్ధి స్థాయి మాత్రమేనని అంబేద్కర్ మహాశయుడు చెప్పారని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. ఆయన మాటలు మననం చేసుకుంటూ మహిళల వికాసానికి, భద్రతకు, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్
కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనేక ఆదర్శనీయ నిర్ణయాలు తీసుకుని పరుషులతో సమానంగా మహిళల కు అన్ని సదుపాయాలు కల్పిస్తోందన్నారు.

మహిళలకు కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులకు, బాలింతలకు, శిశువులకు ప్రతి రోజు పాలు, గుడ్లతో కూడిన పోషకాహారాన్ని ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. గర్భిణులు ఆస్పత్రులకు వచ్చిపోడానికి అమ్మఒడి వాహనాల ద్వారా ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించామని మంత్రి హరీశ్​రావు చెప్పారు. కేసీఆర్ కిట్స్ తో గర్భిణులకు ఆర్థికంగా సాయం అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, పోలీస్ ఉద్యోగ నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని మంత్రి గర్వంగా చెప్పారు. అలాగే, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు నెలకు రూ.2,016 పెన్షన్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినుల కోసం 53 డిగ్రీ గురుకుల కాలేజీలను ప్రారంభించామని తెలియజేశారు. ఆడపిల్లలకు హెల్త్, హైజీన్ కిట్స్ లను ప్రభుత్వం అందిస్తుందని మంత్రి హరీశ్​రావు వెల్లడించారు.