అమృత్ మహోత్సవ్ వేడుకల్లో గవర్నర్

వరంగల్ : స్వాతంత్య్ర భారత్ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రెండు చోట్ల ప్రారంభించింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‎లో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొనగా, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వరంగల్ నగరంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్రంలో 75 వారాల పాటు ఈ ఉత్సవ వేడుకలు కొనసాగనున్నాయి.

ads