జస్టిస్ ఎన్వీ రమణకు గవర్నర్ విందు

హైదరాబాద్ : హైదరాబాద్ కు వచ్చిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయన గౌరవార్థం శుక్రవారం రాజ్ భవన్ లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీజేఐ ఎన్వీ రమణ దంపతులు హాజరయ్యారు. ఈ విందుకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, సీఎం కేసీఆర్ తదితరులు హాజరయ్యారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారి హైదరాబాద్ కు వచ్చారు. మూడు రోజుల పాటు రాజ్ భవన్ గెస్ట్ హౌజ్ లో బస చేయనున్నారు.

ads