28న గ్రాడ్యుయేట్స్ సభ

ads

వరంగల్​ అర్బన్​ జిల్లా : వరంగల్​ తూర్పు నియోజకవర్గంలోని దేశాయిపేటలో ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 10 వేల మందితో సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. శుక్రవారం సీకేఎం కళాశాల మైదానంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. మేధావులు, విద్యావేత్తలు , గ్రాడ్యుయేట్స్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. అలాగే మంత్రులు , ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మమ్మురం చేసినట్టు ఎమ్మెల్యే నరేందర్​ వెల్లడించారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు కావేటి కవిత రాజు యాదవ్, శారదా సురేష్ జోషి,ముఖ్యనాయకులు పాల్గొన్నారు.