గుర్తుందా శీతాకాలం ఫస్ట్‎లుక్ రిలీజ్

హైదరాబాద్: టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేకర్ తెరకెక్కిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ప్ర‌తీ ఒక్క‌రు త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌ణ‌లు ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్ మీద నాగ‌శేఖ‌ర్ – భావ‌న‌ర‌వి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ఇప్ప‌టికే ఈ సినిమా టైటిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. టాలెంటెడ్ హీరో స‌త్యదేవ్, త‌మ‌న్నా, మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి కూడా బాగానే పెరిగిపోయింది.

ఇండ‌స్ట్రీలో వ‌ర్గాల్లోనూ ఈ సినిమా పై ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. క‌న్న‌డ‌లో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ల‌వ్ మాక్ టేల్ ఆధారంగా గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ షూట్ చేసుకుని మ‌రో షెడ్యూల్ షూట్ చేసుకోవ‌డానికి సెట్స్ మీద‌కు వెళుతుంది గుర్తుందా శీతాకాలం. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న గుర్తుందా శీతాకాలం చిత్రం ఫస్ట్‎లుక్ విడుదల చేసారు. అందులో సత్యదేవ్, తమన్నా ఒకరిని ఒకరు రొమాంటిక్‌గా చూసుకుంటూ చేతులు కలుపుకుని ఉన్నారు. ఈ ఫోటో అభిమానులకే కాదు అందరికీ బాగా నచ్చేస్తుంది. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్ విడుదల కానుందని తెలిపారు దర్శక నిర్మాతలు. మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.

నటీనటులు:
స‌త్య‌దేవ్, త‌మ‌న్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియద‌ర్శి త‌దిత‌రులు

టెక్నికల్ టీం:
బ్యాన‌ర్ – నాగశేఖ‌ర్ మూవీస్
స‌మ‌ర్ప‌కులు – ఎమ్‎ఎస్ రెడ్డి, చిన‌బాబు
నిర్మాత – నాగశేఖ‌ర్ , భావ‌న ర‌వి
ప‌బ్లిసిటీ డిజైన‌ర్స్ – అనిల్, భాను మేఘ‌శ్యామ్
కొరియోగ్రఫి – వీజేశేఖ‌ర్
లైన్ ప్రొడ్యూస‌ర్స్ – సంప‌త్, శివ ఎస్. య‌శోధ‌ర‌
ఎక్సీక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – న‌వీన్ రెడ్డి
డైలాగ్స్ – ల‌క్ష్మీ భూపాల్
మ్యూజిక్ – కాల‌భైర‌వ‌
ఎడిటర్ – కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
సినిమాటోగ్రాఫ‌ర్ – స‌త్య హెగ్డే
స్టంట్స్ – వెంక‌ట్
స్కీన్ ప్లే, డైరెక్ష‌న్ – నాగ‌శేఖ‌ర్