గ్రీన్ ఇండియా ఛాలెంజ్

నల్గొండ జిల్లా: తన జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‎ను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వీకరించారు.ఇందులో భాగంగా శాసన మండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమం రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు పెంచడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.