జిల్లాకు సీఎం వరాల జల్లు

నల్లగొండ జిల్లా : జిల్లాకు సీఎం కేసీఆర్​ వరాల జల్లు కురిపించారని శాసన మండలి చైర్మన్​ గుత్తాసుఖేందర్​రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి జిల్లాను అభివృద్ధి చేస్తున్నారని గుత్తా చెప్పారు. ఈ నెల 10 తేదీన టీఆర్​ఎస్​ భారీ బహిరంగ సభ జరగనున్నసభా స్థలిని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేషన్ చైర్మన్లు బాల మల్లు ,మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , టీఆర్​ఎస్​ నేత నోముల భగత్ తో కలిసి పరిశీలించారు. కలెక్టర్, ఎస్పీ ,తదితర అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు జరిగే తీరును అడిగి తెలుసుకున్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు గుత్తాసుఖేందర్​రెడ్డి.

‘నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అనేది నల్గొండ జిల్లాకు వరప్రదాయిని. నెల్లికల్లు ప్రాజెక్ట్​ పూర్తి చేయాలని దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చివరివరకు ప్రయత్నం చేశారు. నర్సింహయ్య కు నివాళులు అర్పిస్తూ సాగర్ నియోజక వర్గానికి చెందిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు అన్నారు శాసన మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి. సీఎం కేసీఆర్ నాయకత్వం లో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పథంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమాలు చేస్తూ రాష్టాన్ని బంగారు తెలంగాణ గా తీర్చిదిద్దారని గుత్తా కొనియాడారు. జిల్లాను అభివృద్ధి చేసిన సీఎం రుణం తీర్చుకునే అవకాశం నాగార్జున సాగర్ ప్రజలకు కలిగిందన్నారు గుత్తా సుఖేందర్​రెడ్డి. 10వ తేదీన జరిగే ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నల్లగొండ ప్రజలను కోరుతున్నాను’అన్నారు శాసన మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్ ,జెడ్పీ వైస్ చైర్మన్ పెద్దులు, మాజీ అప్కాబ్​ చైర్మన్ యడవల్లి విజేందర్, టీఆర్​ఎస్​ నాయకులు గడ్డంపల్లి రవీందర్ హాజరయ్యారు.