అదరగొట్టిన మంత్రి హరీష్‎

సంగారెడ్డి జిల్లా : జహీరాబాద్‎లోని బాగారెడ్డి మైదానంలో ఫ్లడ్‌లైట్లు ప్రారంభించిన రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు క్రికెట్ ఆడారు. మంత్రి హరీష్ రావు టీం వర్సెస్ జిల్లా కలెక్టర్ హన్మంతరావు టీంల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. మంత్రి హరీస్ రావు టీం వర్సెస్ జిల్లా కలెక్టర్ హన్మంతరావు టీంల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది.

ఈ క్రమంలో తనదైన శైలిలో ఫోర్లు, సిక్సులతో బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తూ, జట్టుకు భారీ స్కోర్ అందించారు మంత్రి హరీష్ రావు. అపోజిట్ జట్టు బౌలర్లు హరీష్‎రావుకు బౌలింగ్ వేయలేక బెంబేలెత్తిపోయారు. ప్రొఫెషనల్ క్రికెట్ గేమ్ ను తలపించిన మంత్రి హరీష్ రావు ఆటతీరును చూసి జహీరాబాద్ క్రీడాభిమానులు చప్పట్లతో ప్రోత్సహించారు.