ఎంఎస్ఎంఈ ల రిజిస్ట్రేషన్ సులభతరం అయ్యిందా?

ఢిల్లీ : సూక్ష్మ, చిన్న,మధ్య,తరహా పరిశ్రమల రిజిస్ట్రేషన్ ను సులభతరం చేశారా? చేస్తే ఏ విధంగా చేశారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్ సభలో గురువారం ప్రశ్నించారు. దీనికి ఆధార్, పాన్ కార్డ్ ల అవసరం ఉందా అని కూడా ప్రశ్నించారు. దీనికి కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణ జవాబు చెబుతూ ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను డిజిటల్, పేపర్ లెస్ గా ఆన్ లైన్ చేశామని లిఖితపూర్వకంగా తెలిపారు.

ads

ఇది గత ఏడాది జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. అయితే రిజిస్ట్రేషన్ కోసం ఆధార్, పాన్ నెంబర్లు మాత్రం అవసరమని తెలిపారు. ఆయా సంస్థల పెట్టుబడి టర్నోవర్ లపై పాన్, జి. ఎస్. టి. ఎన్ అనుసంధాన వివరాలు స్వయంచాలకంగా తీసుకోబడతాయని పేర్కొన్నారు.