హెచ్ సీయూ ప్ర‌వేశ ప‌రీక్ష నోటిఫికేష‌న్ రిలీజ్

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యం(హెచ్‌సీయూ) ప్ర‌వేశ ప‌రీక్ష‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నెల 21 నుంచి జులై 20 వ‌ర‌కు ఆన్‌లైన్ దర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌రులో ప్ర‌వేశ ప‌రీక్ష ఉంటుంద‌ని హెచ్‌సీయూ తెలిపింది. దేశ‌వ్యాప్తంగా 39 కేంద్రాల్లో ఈ ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించనున్నారు. హెచ్‌సీయూలో 117 కోర్సుల్లో 2,328 సీట్ల‌కు ఈ నోటిఫికేష‌న్ విడుదల చేశారు. acad.uohyd.ac.in లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయ‌ని హెచ్‌సీయూ స్ప‌ష్టం చేసింది.

ads