15 యేండ్ల తర్వాత 5 వికెట్లు

బెంగళూరు : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ నిషేధం తర్వాత తిరిగి క్రికెట్ లో అడుగుపెట్టిన పేస్ బౌలర్ శ్రీశాంత్ 15 ఏళ్ళ తర్వాత ఒక మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఉత్తరప్రదేశ్ , కేరళ మధ్య మ్యాచ్ లో శ్రీశాంత్ ఈ ఘనత సాధించాడు. 9.3 ఓవర్లు వేసిన అతడు 65 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. దీంతో యూపీ 283 పరుగులకు ఆలౌటైంది. చివరిసారి 2006లో ఓ లిస్ట్ ఎ ఫార్మాట్ మ్యాచ్ లో శ్రీశాంత్ ఐదు వికెట్లు తీశాడు. టోర్నీలో తాను ఆడిన తొలి మ్యాచ్ లో అతడు రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతకు ముందు ఐపీఎల్ లో ఆడాలని శ్రీశాంత్ ఆశపడినా, అతనిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడంతో కనీసం వేలానికి కూడా అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే.