ఆరోగ్య సేవలకు టెక్నాలజీ అవసరం

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినయోగించడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం బీఆర్కేఆర్ భవన్‎లో ఆరోగ్య శాఖలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ షియేటివ్స్ అమలుపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎస్ మాట్లాడారు.

ఆరోగ్యశాఖ ద్వారా రూపొందించిన అప్లికేషన్లు వినియోగించడానికి సులభంగా ఉండాలని అన్నారు. అదేవిధంగా సామర్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, సర్వీస్ డెలివరీని కూడా ప్రభావితం చేసేటట్లు ఉండాలని సూచించారు. ఆరోగ్యశాక పరిధిలోని విభాగాధిపతులు నిర్వహించే రెగులేటరీ విధులను నిర్ణీత సమయంలోగా సమీక్షించి సమగ్ర నివేదికలు రూపొందించాలని సీఎస్ ఆదేశించారు. టెక్నాలజీని సులభతరంగా, పారదర్శకంగా వాడుతూ, వేగవంతంగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకటి కరుణ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి డి. దివ్య, ఆయూష్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ అలుగు వర్షిని, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రీతి మీనా, ఈఏటు సి.యస్ అద్వైత్ కుమార్ సింగ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సోని బాలాదేవి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. రమేశ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలి వెల్ఫేర్ డైరెక్టర్ డా. శ్రీనివాస్ రావు, టీఎస్‎ఎంఎస్‎ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.