భారీగా పట్టుబడిన బంగారం

శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ వయా కొచ్చిన్ మీదుగా వచ్చిన ఓ‌ ప్రయాణికుడి వద్ద రూ. 60 లక్షల విలువచేసే 1.2 కేజీల‌ బంగారం పట్టుబడింది. బంగారాన్ని విమానం బాత్ రూమ్ లో దాచిపెట్టి కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి ప్రయత్నించిన కేటుగాడు. అయినప్పటికీ కస్టమ్స్ అధికారుల విచారణలో బాత్ రూంలో ఉన్న బంగారం బయటపడింది. దీంతో పట్టుబడిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ads