న్యూఢిల్లీ : దేశంలో బంగారం ధర స్వల్పంగా, వెండి ధర భారీగా పెరిగింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.132 పెరిగి రూ.48,376కు చేరింది. క్రితం ట్రేడ్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 48,244 వద్ద ముగిసింది. హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్ నిపుణులు ఈ వివరాలను వెల్లడించారు.
ఇదిలా ఉంటే వెండి ధర మాత్రం నేటి ట్రెండింగ్ లో భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.2,915 పెరిగి రూ.68,410కి చేరింది. క్రితం ట్రేడ్ లో కిలో వెండి ధర రూ.65,495 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,844.35 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.35 అమెరికన్ డాలర్ లు పలికింది.