ఐదు జిల్లాలకు భారీ వర్షసూచన!

అమరావతి : ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఇది ఏర్పడొచ్చని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్లొద్దని సూచించింది. అల్పపీడనం కారణంగా కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

ads