నవీన్ చంద్ర హీరోగా సర్వంత్ రామ్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 9 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభంహైదరాబాద్ : సర్వంత్ రామ్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 9 చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ నటి మధుబాల ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్ క్లాప్ కొట్టగా.. మూవీ స్క్రిప్ట్‌ను సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చిత్ర యూనిట్‌కు అందచేశారు. రాశి మూవీస్ అధినేత నరసింహారావు కెమెరా స్విచ్ఛాన్ చేయగా చిత్ర దర్శకుడు అరవింద్ మొదటి షాట్‌కు యాక్షన్ చెప్పారు.
‘అరవింద్ చెప్పిన ఈ థ్రిల్లర్ నాకు బాగా నచ్చింది. మధుబాలతో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మంచి థ్రిల్లర్‌లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సర్వంత్ రామ్ క్రియేషన్స్‌లో రాబోతున్న మరో మంచి సినిమా ఇది. మరిన్ని మంచి చిత్రాల్లో నటించడానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి.’అని తెలిపారు హీరో నవీన్‌చంద్ర.
‘ ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. డైరెక్టర్ అరవింద్ నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఈ సినిమాలో డీజీపీగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాను. చాలా కాలం తరువాత మంచి కథతో తెలుగులో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు సీనియర్ నటి మధుబాల.
‘ఈ పాత్రకు నన్ను సెలక్ట్ చేసినందుకు సర్వంత్ రామ్ క్రియేషన్స్ నిర్మాతకు, దర్శకుడికి ధన్యవాదాలు. మధుబాలతో నటించడం ఇట్స్ మై డ్రీమ్. సినిమా బ్యానర్ లాగే కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను.’ అని అన్నారు హీరోయిన్ స్మృతి వెంకట్.
‘సర్వంత్ రామ్ క్రియేషన్స్‌లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. మధుబాల ఈ మూవీలో చాలా కీలక పాత్రలో నటిస్తున్నారు. నవీన్ చంద్ర మా స్క్రిప్ట్ నచ్చి ఈ మూవీ ఒప్పుకున్నారు. నిర్మాత నాపై నమ్మకం ఉంచినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరినీ అలరించే విధంగా ఈ సినిమా ఉంటుంది.’ అన్నారు డైరెక్టర్ అరవింద్.
‘ఈ కథ విని వెంటనే నవీన్ చంద్ర ఒప్పుకున్నారు. ఆయన నిర్మాతల హీరో అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ అరవింద్ మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ కథను రాసుకున్నారు. మధుబాల ఈ సినిమాలో నటించడం మరో పెద్ద ఎస్సెట్. ఫిబ్రవరి నుంచి చెన్నైలో షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్‌లో ఎండ్ చేస్తాము. ఒకే షెడ్యూల్లో సినిమాను అనుకున్న టైమ్‌లో పూర్తి చెయ్యడానికి ప్లాన్ చేశాము. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం మరో హైలెట్ కానుంది’ అని అన్నారు నిర్మాత రామాంజనేయులు జవ్వాజి.
నటీనటులు:
నవీన్ చంద్ర, స్మృతి వెంకట్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో మధుబాల, రఘుబాబు, అచ్యుత్ కుమార్, సత్యం రాజేష్, మీమీ గోపి, పూజా రామచంద్రన్, సుదర్శన్, నవీన రెడ్డి, సిరి శ్రీ, ఆదర్శ్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్ : సర్వంత్ రామ్ క్రియేషన్స్
డైలాగ్స్ : కేవీ రాజమహి
మేకప్ : వినోద్
కాస్ట్యూమ్స్ : గణేష్
స్టిల్స్ : మని వణ్ణన్
పీఆర్వో : వంశీ శేఖర్
కో-డైరెక్టర్ : ఎస్.యమ్. ఇళయరాజా, వరప్రసాద్ వీ
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : రవి, డీ ఉమామహేశ్వర రాజు, దావల చిన్నారావ్
పబ్లిసిటీ డిజైనర్ : చంద్రు
స్టంట్స్ : సెల్వ
ఆర్ట్ : వినోద్ రవీంద్రన్
ఎడిటింగ్ : అరూల్ ఈ సిద్ధార్థ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అంథోని ప్రశాంత్, శివ మల్లాల
మ్యూజిక్ : జిబ్రాన్
కెమెరామెన్ : పీజీ ముత్తయ్య
ప్రొడ్యూసర్ : రామాంజనేయులు జవ్వాజి
స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : అరవింద్ శ్రీనివాసన్