ఫిబ్రవరి 19న ‘చెక్’​

హైదరాబాద్​ : నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వీ ఆనంద్ ​ప్రసాద్ నిర్మిస్తున్న ‘చెక్’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 19న గ్రాండ్ రిలీజ్​ చేస్తున్నామని నిర్మాత వీ ఆనంద్ ప్రసాద్ ప్రకటించారు.

‘జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షథిల్లర్ చిత్రం ఇది. ఈ మధ్యకాలంలో ఈ నేపథ్యంలో సినిమా రాలేదు. కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కాన్సెప్ట్ ఇది. ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలాచేరుకున్నాడన్నది ఈ చిత్రం ప్రధాన కథాంశం. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్- చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో ఉంటాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ కి చక్కటి స్పందన లభించింది. ఇందులోకథానాయికలు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ పాత్రలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి’అని అన్నారు నిర్మాత ఆనందప్రసాద్​.

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరి తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం.

సంగీతం : కళ్యాణి మాలిక్, ఛాయాగ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్ , ఆర్ట్ : వివేక్ అన్నామలై, ఎడిటింగ్ : అనల్ అనిరుద్దన్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి , నిర్మాత : వీ ఆనంద ప్రసాద్, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి.