3వ హిందీ చిత్రానికి రష్మిక గ్రీన్ సిగ్నల్ ..!

హైదరాబాద్ : ఈ సంవత్సరం హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది కన్నడ సోయగం రష్మిక మందన్నా. ఇప్పటికే మిషన్ మజ్నుతో బాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న రష్మిక. మరోకవైపు అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బై చిత్రంలోనూ నటిస్తోంది. ఇదిలా ఉంటే రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే మూడో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్త బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.

ads

ఈ భామ తాజాగా మూడో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అభిమానులతో చేసిన ఛాటింగ్ ద్వారా తెలిసింది. బాలీవుడ్ ప్రాజెక్టుల గురించి ఓ అభిమాని అడుగగా, నేను రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తున్నా, త్వరలోనే మూడో చిత్రానికి సంతకం చేయబోతున్నానని సమాధానం ఇచ్చింది. రష్మిక ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న పుష్పలో నటిస్తోంది.