మార్చి 10, 14న సెలవులు కావాలి

అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా మార్చి 10ని సెలవుదినంగా ప్రకటించాలని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికలు జరుగనున్న 12 నగర పాలక పాలికలు, 75 పురపాలికల్లో సెలవు ప్రకటించాలని సూచించారు. సోమవారం ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు. మార్చి 10 ఎన్నికల రోజు, మార్చి 14 కౌంటింగ్ రోజున ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కోరారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీస్ శాఖ దృష్టి పెట్టాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.