కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే ముఖ్యం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిద్ర గురించి, నిద్ర పోయే సమయాల గురించి మనం అనేక విషయాలు వింటూనే ఉంటాం. ముఖ్యంగా ప్రతి మనిషి సుమారు 7-8గంటలు నిద్ర పోవడం అవసరం అని అంటుంటారు. కానీ అందులో పూర్తి నిజం లేదు. మనిషి వయసుని బట్టి నిద్ర సమయాలు మారుతూ ఉంటాయి. వయసుబట్టి మనిషి ఎంత సేపు నిద్ర పోవాలి, మనిషికి ఆవలింతలు ఎందుకు వస్తాయి, లాంటి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
వయసుని బట్టి నిద్రపోయే సమయం :
పుట్టినప్పటి నుండి 3నెలల వరకు పిల్లలు సుమారు 17గంటలు నిద్రపోవాలి.
4-11 నెలల వయసు ఉన్న పిల్లలు 12-15 గంటలు.
1-2 యేండ్ల వయసు పిల్లలు 11-14 గంటలు.
3-5 యేండ్ల వయసు ఉన్న పిల్లలు 10-13 గంటలు.
6-13 యేండ్ల వయసు ఉన్న పిల్లలు 9-11 గంటలు.
14-17 యేండ్ల వయసు ఉన్నవారు 8-10 గంటలు.
18-25 యేండ్ల వయసు ఉన్న వారు 7-9గంటలు.
26-64 యేండ్ల వయసు ఉన్న వారు 7-9 గంటలు.
65+ పై బడిన వారు 7-8 గంటలు నిద్ర పోవాలి.