భారీగా పట్టుబడిన బంగారం

యాదాద్రి భువనగిరి జిల్లా : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న 25 కిలోల బంగారం బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ ఐ ) విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.11.63 కోట్ల విలువ ఉంటుందని తెలిపారు. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా కారు ఎయిర్ బ్యాగులో బంగారం తరలిస్తుండగా అధికారులు చాకచక్యంగా గుర్తించి పట్టుకున్నారు.అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. నిందితులు హైదరాబాద్ లోని పలు దుకాణాలకు బంగారం చేరవేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. అస్సాం రాజధాని గువాహటి నుంచి కొంతకాలంగా వీరు నగరానికి బంగారం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ads