నెక్నాపూర్​లో దారుణం

రంగారెడ్డి జిల్లా : నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెక్నాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కుటుంబ కలహాలతో ఒక భర్త భార్య రత్నకుమారి తలను బండకేసి మోదాడు. ఆతర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు నార్సింగి పోలీసులు, క్లూస్ టీమ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించాయి. దంపతులది ఏపీలోని కాకినాడ గా గుర్తించారు. మూడేళ్ల క్రితం వారు హైదరాబాద్​కు వచ్చి స్థిరపడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

ads