శ్రీముఖికి పండు బాగా తెలుసట

హైదరాబాద్​ : శ్రావణ్ వై జీటీ, షీతల్ భట్ జంటగా కే భిక్షపతి దర్శకత్వంలో రుద్రక్రాంతి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై వెంకటేశం నిర్మిస్తున్న సినిమా “మరో ప్రేమకథ” ఇదొక లవ్ ఎంటర్​టైనర్ గా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి నల్లని కాటుకా అనే వీడియో సాంగ్ విడుదలై , మ్యూజిక్ లవర్స్ తో పాటు మాస్ బీట్ సాంగ్ అభిమానులను అలరిస్తుంది. అయితే ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసింది ప్రముఖ ఢీ కొరియోగ్రాఫర్ పండు.

‘మరో ప్రేమకథ అనే సినిమా నుంచి తాజాగా నల్లని కాటుకా అనే వీడియో సాంగ్ రిలీజ్ అయింది. నేను ఆ సాంగ్ చుశాను. పాట కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఆ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసిన పండు నాకు బాగా తెలుసు. పండు డార్లింగ్ నువ్వు కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. సాంగ్ లో మంచి ఎనర్జీ ఉంది. ఈ సాంగ్ లో డ్యాన్స్ పట్ల నీకున్న ఇష్టం కనపడుతుంది. నేను టీం అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ, మా పండు కి ఆల్ థ బెస్ట్ తెలుపుతున్నాను’ అని అన్నారు శ్రీముఖి.

కాగా ఈ సాంగ్ లో ఐటెం గర్ల్ గా అదిరిపోయే స్టెప్ లు వేసిన నమ్రిత మల్ల డ్యాన్స్ కు యూత్ ఫిదా అవుతున్నారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది.