సమస్యలను సీఎంకు వివరిస్తాం

హైదరాబాద్​ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీతో గురువారం బీఆర్ కేఆర్ భవన్ లో ఉద్యోగ సంఘాలు సమావేశం అయ్యాయి.

పీఆర్టీయూ టీఎస్, తెలంగాణ క్లాస్ 4 ఎంప్లాయీస్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్, ట్విన్ సిటీస్ తెలంగాణ గవర్నమెంట్ డ్రైవర్ సెంట్రల్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు కమిటీ ఐదు అసోసియేషన్ల సభ్యులతో విడివిడిగా సమావేశమైంది. పీఆర్సీ రికమెండేషన్స్, ఇతర ఉద్యోగ సమస్యలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు క్లుప్తంగా విన్నది. పీఆర్సీ రికమెండేషన్స్ పై యూనియన్ సభ్యులు విన్నవించిన అంశాలను సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చింది. ఈ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.