నర్సింహా మృతిపై సంతాపం

హైదరాబాద్​: ఏఐటీయూసీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కార్మికోద్యమ నేత నర్సింహా ఆకస్మిక మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే)లు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశాయి. కార్మిక లోకం గొప్ప ఉద్యమ నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశాయి. మంగళవారం ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారుడు దేవులపల్లి అమర్, ఐజేయూ, టీయూడబ్ల్యూజే నేతలు కే .శ్రీనివాస్ రెడ్డి, నగునూరి శేఖర్, కే విరాహత్ అలీ, వై నరేందర్ రెడ్డి, దాసరి కృష్ణారెడ్డి, పీసీఐ సభ్యులు ఎం.ఏ.మజీద్ ఏఐటీయూసీ కార్యాలయంలో నర్సింహా మృతదేహానికి నివాళ్లర్పించారు.