పోస్ట్​ ప్రొడక్షన్​లో “మిస్టర్ క్యూ”

హైదరాబాద్​ : లక్ష్మీ దామోదర క్రియేషన్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో బహుముఖ ప్రతిభాశాలి ‘శివాజీ కారోతి’ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మిస్టర్ క్యూ”. వినూత్నమైన కథాంశంతో క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రైజింగ్ స్టార్ రాజ్ బాల హీరోగా నటిస్తున్నారు. స్వాతి, త్రివేణి హీరోయిన్లు. జూనియర్​ నరేష్, సుధీర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మిస్టర్ క్యూ’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ads

‘ఇదొక విభిన్నమైన కథాచిత్రం. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసేవాళ్లకు విపరీతంగా నచ్చుతుంది. ముఖ్యంగా ఈ చిత్రం మా హీరో ‘రాజ్ బాల’కు మంచి బ్రేక్ ఇస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము’అన్నారు.
దర్శకనిర్మాత శివాజీ కారోతి

ఈ చిత్రానికి సంగీతం : పద్మనాభ భరద్వాజ్, ఎడిటింగ్ : సెల్వ, కెమెరా : కళ్యాణ్ సమి, మాటలు-స్క్రీన్ ప్లే : చలపతి పువ్వల, రచన-నిర్మాణం-దర్శకత్వం : శివాజీ కారోతి