అగ్రశ్రేణి ఆటోమొబైల్ హబ్‎గా భారత్ !

న్యూఢిల్లీ : రాబోయే ఐదేండ్లలో భారత్ ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమొబైల్ తయారీ హబ్ గా ఎదుగుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో భారత్ కు మెరుగైన సామర్థ్యం, అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సోలార్ పవర్ ను ముమ్మరంగా చేపట్టడం ద్వారా సౌర విద్యుత్ ను ఆటో మొబైల్స్ , ఇతర అభివృద్ధి పనుల్లో వాడవచ్చని వ్యాఖ్యానించారు.

ads

దేశవ్యాప్తంగా చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ -సౌర, ఎంఎస్ఎంఈలో అవకాశాలు అనే అంశంపై జరిగిన వెబినార్ ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. మంచి ట్రాక్ రికార్డు కల్గిన ఎంఎస్ఎంఈలను క్యాపిటల్ మార్కెట్ లోకి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. భారత ఎంఎస్ఎంఈల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన విదేశీ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు.