ఇంగ్లాండ్ పై ఇండియా ఘన విజయం

పుణె : ఇంగ్లాండ్‎తో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. టీం ఇండియా నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. ఆల్‎రౌండ్ షోతో అదరగొట్టిన ఇండియా 66 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‎లో ఇండియా 1-0 తో ఆధిక్యం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో జానీ బెయిర్ స్టో ( 46 : 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ ) తో కలిసి తొలి వికెట్‎కు 135 పరుగులు జోడించాడు. రాయ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్‎స్టోక్స్ ఎక్కువ సేపు నిలువలేదు. వీరిద్దరినీ కృష్ణ పెవిలియన్ పంపాడు. బెయిర్‎స్టో మాత్రం తన దూకుడును కొనసాగించాడు.

ads

సెంచరీకి చేరువలో శార్దుల్ బౌలింగ్‎లో బెయిర్ స్టో వెనుదిరగడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కకావికలమైంది. శార్దుల్, ప్రసిధ్ ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. శార్దుల్ ఒకే ఓవర్లో ఇయాన్ మోర్గాన్ (22), జోస్ బట్లర్ (2)లను పెవిలియన్ పంపడంతో ఇండియా మ్యాచ్ పై పట్టు సాధించింది. ఆఖర్లో నిలకడగా ఆడుతున్న మెయిన్ అలీని భువీ ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎక్కువసేపు పట్టలేదు. భారత్ బౌలర్లలో అరంగేట్ర బౌలర్ ప్రసిధ్ కృష్ణ నాలుగు వికెట్లు తీయగా, శార్దుల్ ఠాకూర్ 3, భువనేశ్వర్ కుమార్ 2, కృనాల్ పాండ్య 1 వికెట్ తీశారు.