టీ20 సిరీస్ కోసం భారత్ కసరత్తు

అహ్మదాబాద్ : సొంతగడ్డపై ఇంగ్లాండ్‎తో టెస్టు సిరీస్‎లో దుమ్మురేపిన టీం ఇండియా పొట్టి సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. ఇంగ్లీష్ జట్టుపై టెస్టు సిరీస్‎లో నెగ్గి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న కోహ్లీసేన టీ20 పట్టేయాలనే లక్ష్యంతో కసరత్తులు చేస్తున్నది. మార్చి 12 నుంచి మొతేరా స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 ఆరంభంకానున్న విషయం తెలిసిందే.

ads

ఈ నేపథ్యంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, యుజువేంద్ర చాహల్, హార్డిక్ పాండ్య నెట్స్‎లో సాధన చేశారు. ట్రైనింగ్ సెషన్‎కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్‎లో పోస్ట్ చేసింది.