రెండు వికెట్లు కోల్పోయిన భారత్​

చెన్నై: ఇంగ్లండ్​తో జరుగుతున్నమొదటి టెస్టు మ్యాచ్​లో భారత్​ కష్టాల్లో పడింది. మొదటి ఇన్నింగ్స్​లో ఇంగ్లండ్​కు 578 రన్స్ భారీ స్కోరు సమర్పించుకున్న కోహ్లి సేన.. అప్పుడే రెండు వికెట్టు పోగొట్టుకుంది. మూడో రోజు లంచ్​ సమయానికి రెండు వికెట్లకు 59 రన్స్​ చేసింది. ఇంగ్లండ్​ పేసర్ జోఫ్రా ఆర్చర్​ ధాటికి ఓపెనర్లు రోహిత్​శర్మ(6) శుభ్​మన్​గిల్​(29) పెవిలియన్​ చేరారు. ప్రస్తుతం పుజారా (20 నాటౌట్​), కెప్టెన్​ కోహ్లి(4 నాటౌట్​) క్రీజులో ఉన్నారు.