కోల్‌కతా: భారత పేసర్ అశోక్ దిండా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 15యేండ్ల పాటు సాగిన క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నానని తెలిపాడు. మంగళవారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించాడు. దిండా భారత్ తరపున 13 వన్డేలు, తొమ్మిది టీ20లు ఆడాడు.
ప్రారంభం నుంచి దేశవాళీ క్రికెట్లో బెంగాల్ తరపున ఆడిన అతను 2019-2020 సీజన్లో ఒక్క రంజీ మ్యాచ్ ఆడి క్రమశిక్షణ చర్యలకు గురయ్యాడు. దీంతో ఈ యేడాది గోవాకు మారాడు. ఆ జట్టు తరుపున ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు మ్యాచ్‌లు ఆడాక, ఇక క్రికెట్‌కు తన శరీరం సహకరించడం లేదని గుర్తించి కెరీర్‌కు ముగింపు పలికాడు. ఐపీఎల్లో దిండా ఢిల్లీ డేర్ డెవిల్స్ , కోల్‌కతా, పుణె, బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించి, 78 మ్యాచ్ ల్లో 68 వికెట్లు పడగొట్టాడు.