నిలకడగా రాష్ట్రపతి ఆరోగ్యం

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆర్మీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. మరిన్ని వైద్య పరీక్షల కోసం ఆయనను ఎయిమ్స్ కు సిఫారసు చేసినట్లు శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపింది. రాష్ట్రపతి శుక్రవారం స్వల్ప అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఛాతిలో అసౌకర్యంగా ఉండటంతో ఢిల్లీలోని ఆర్అండ్ఆర్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్ లో అడ్మిట్ అయిన రాంనాథ్ కోవింద్ కు వైద్యులు ప్రాథమిక చికిత్సగా సాధారణ పరీక్షలు చేయగా, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రాష్ట్రపతిని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ , రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు.

ads