టెస్ట్ సిరీస్ ఇండియా కైవసం

అహ్మదాబాద్ : ఇంగ్లండ్‎తో జరిగిన టెస్టు సరీస్‎ను భారత్ కైవసం చేసుకుంది. 3-1 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. నాల్గో టెస్టులో ఇన్నింగ్స్ 25 పరుగులు తేడాతో కోహ్లీ సేన విజయం సాధించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్ లో కూడా చేతులెత్తేశారు. భారత బౌలర్ల ధాటికి కుప్పకూలారు. 135 పరుగులకే కుప్పకూలారు. అక్షర్ పటేల్, అశ్విన్‎లు మరోసారి చెలరేగారు. ఇంగ్లీష్ ఆటగాళ్లను బెంబేలెత్తించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ ఆటకట్టించారు. తొలి ఇన్నింగ్స్‎లో ఇంగ్లండ్ 205 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‎లో 135 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‎లో భారత్ 365 పరుగులు చేసింది. రిషభ్ పంత్ సెంచరీ చేయగా వాషింగ్టన్ సుందర్ 6 పరుగులు చేశాడు.

ads