పెర్ల్ బాక్సింగ్ టోర్నీలో భారత్ టాప్

న్యూ‎ఢిల్లీ : అడ్రియాటిక్ పెర్ల్ బాక్సింగ్ టోర్నీలో భారత్ టాప్‎లో నిలిచింది. సోమవారం చివరి రోజు పోటీల్లో బేబీరోజిసనా చాను ( 51 కేజీలు), అరుంధతి ( 69 కేజీలు) స్వర్ణాలు…లక్కీ(64 కేజీలు) రజతం గెలుచుకున్నారు. ఫలితంగా భారత్ ఖాతాలో మొత్తం 10 పతకాలు ( 5 స్వర్ణాలు, 3 కాంస్యాలు, 2 రజతాలు ) చేరాయి. ఎజ్బెకిస్థాన్ (2 స్వర్ణాలు), చెక్ రిపబ్లిక్ ( 1స్వర్ణం) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.