చెన్నై: ఇండియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 578 రన్స్‌కు అలౌట్ అయింది. ఓవరనైట్ స్కోరు555/8తో ఆదివారం మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మిగిలిన రెండు వికెట్స్‌ను కొద్ది తేడాలో కోల్పోయింది. బెస్ 34 రన్స్‌కు బుమ్రా బౌలింగ్‌లో వెనుదిరగగా, అండర్సన్(1) అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 578రన్స్‌కు ఆలౌట్ అయింది. ఇండియా బౌలర్స్‌లో అశ్విన్, బుమ్రా మూడు వికెట్స్ తీయగా, నదీమ్, ఇషాంత్‌శర్మ చెరో రెండు వికెట్లు తీశారు.
వందో టెస్ట్ ఆడిన ఇంగ్లండ్ కెప్టెన్ అద్భుత ప్రదర్శనతో డబుల్ సెంచరీ చేయడంతో ఆ టీం భారీ స్కోరును దక్కించుకుంది. క్లిష్టమైన క్యాచ్‌లను అశ్విన్, పుజారా, రోహిత్శ ర్మ వదిలేయడంతో ఇండియా అందుకు తగిన నష్టాన్ని చవిచూసింది. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో మరో మూడు రోజులు మిగిలి ఉండగా , ఇండియా జట్టు ఇంగ్లండ్ టీం విజయాన్ని ఎలా అడ్డుకుంటుందో చూడాలి. ఇక మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ 6 రన్స్ కు రోహిత్ శర్మను పెవీలియన్‌కు పంపాడు. దీంతో ఇండియా ప్రస్తుతం వికెట్ కోల్పోయి 22 పరుగులు చేసింది.
ఎడిట్
రెండు వికెట్లు కోల్పోయిన భారత్
చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్నమొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్ కష్టాల్లో పడింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 578 రన్స్ భారీ స్కోరు సమర్పించుకున్న కోహ్లి సేన.. అప్పుడే రెండు వికెట్టు పోగొట్టుకుంది. మూడో రోజు లంచ్ సమయానికి రెండు వికెట్లకు 59 రన్స్ చేసింది. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ధాటికి ఓపెనర్లు రోహిత్‌శర్మ(6) శుభ్‌మన్‌గిల్(29) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం పుజారా (20 నాటౌట్), కెప్టెన్ కోహ్లి(4 నాటౌట్) క్రీజులో ఉన్నారు.