రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. గత నెల జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో శనివారం ఫిబ్రవరి 13న రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తొలి డోస్ తీసుకున్న వారికి నేటి నుంచి రెండో డోస్ వ్యాక్సిన్ ప్రారంభించారు. టిమ్స్ డైరెక్టర్ విమలా థామస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్యాధికారులు మాట్లాడారు. మొత్తం 140 కేంద్రాల్లో కోవిడ్ టీకాలు ఇస్తున్నట్లు చెప్పారు. తొలి విడతలో ఏ కంపెనీ డోస్ తీసుకున్నారో, రెండో విడతలో కూడా అదే కంపెనీ డోస్ తీసుకోవాలని తెలిపారు.

మొదటి డోస్ తీసుకోని సిబ్బంది ఈ నెల 25 లోగా డోస్ తీసుకోవాలని, 25వ తేదీ తర్వాత తొలి డోస్ ఇచ్చ అవకాశం లేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన మూడు లక్షల మందికి పైగా సిబ్బంది వ్యాక్సినేషన్ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు.