న్యాయవాదుల హత్య పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్​: సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది గట్టువామన్​రావు, నాగమణిల హత్యకేసుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎంతమందిని సెక్షన్ 164 కింద ఇన్వెస్టిగేషన్ చేశారని ఎందరిని మంథిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారని హైకోర్టు ప్రశ్నించింది. ఏ2 -ఏ3 ల164 స్టేట్ మెంట్ నమోదు ఇంకా ఎందుకు చేయలేదని అడిగింది. బాధితుల క్రిటికల్ స్టేట్​మెంట్​ను ఎందుకు రికార్డు చేయలేదని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. బాధితులను అంబులెన్స్​లో తీసుకెళ్తున్నప్పుడు వారి స్టేట్​మెంట్లను రికార్డ్ చేయొచ్చు కదా..? అని అడిగింది. మెజిస్ట్రేట్ ని తీసుకొచ్చి వారి ముందర స్టేట్​ మెంట్​ తీసుకోవచ్చు కదా హైకోర్టు పోలీసులను వివరణ అడిగింది.

ads

హత్య జరిగిన ప్రాంతం నుంచి పోలీసులు మొబైల్ ఫోన్స్ , రక్తపు మరకలను, కాల్ డేటా ని నిందితులు వాడిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి
వరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఏజీ పేర్కొన్నారు. రెండు బస్సుల డ్రైవర్లకు కూడా సాక్షులుగా గుర్తించామన్నారు . వారికి రక్షణ కూడా కల్పించామని తెలిపారు ఏజీ. నేరస్తుల నుంచి సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వారి స్టేట్ మెంట్ రికార్డు చేశామని కోర్టుకు వివరించారు. ఇప్పటి వరకు 8 మంది ప్రత్యక్ష సాక్షులను గుర్తించామని తెలిపారు. త్వరలోనే వారి స్టేట్​మెంట్లను కూడా రికార్డు చేస్తామని ఏజీ కోర్టుకు వివరించారు. నేరస్తుల నుంచి ఇంకా కావాల్సిన సాక్షాలు సేకరించవలసి ఉందన్నారు. కాబట్టి సీఆర్పీసీ సెక్షన్ 164 కింద రికార్డ్ చేయలేదని ఏజీ కోర్టుకు వాదన వినిపించారు. కేవలం 161 స్టేట్ మెంట్ మాత్రమే నమోదు చేశామని చెప్పారు. ఆధారాల సేకరణకు ఇంకా రెండు వారాల సమయం కావాలని హైకోర్టును కోరారు ఏజీ. దీంతో తదుపరి విచారణను మార్చ్ 15 కు వాయిదా వేసింది హైకోర్టు.