న్యాయవాదుల హత్యలపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : న్యాయవాదులు వామన్ రావు, నాగమణి దంపతుల హత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తు స్థాయి నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. ఏడుగురు నిందితుల వాంగ్మూలాలను మెజిస్ట్రేట్ వద్ద నమోదు చేసినట్లు ఏజీ ప్రసాద్ తెలిపారు. 32 మంది ప్రత్యక్ష సాక్షుల్లో 26 మంది వాంగ్మూలాలు మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు లచ్చయ్య, వసంతరావు, అనిల్ మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఎఫ్ఎస్ఎల్ కి పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే ఎఫ్ఎస్ఎల్ నివేదిక రావడానికి 4 వారాలు పట్టే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

ads

మే 17 నాటికి హత్య జరిగి 90 రోజులు కానుందని, మే 17 నాటికి సమగ్ర ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉందని ఏజీ చెప్పారు. పోలీసుల నివేదికలు తమకు ఇచ్చేలా ఆదేశించాలని కోరిన వామన్ రావు తండ్రి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే వామన్ రావు తండ్రి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసుల నివేదికలపై తాము సంతృప్తి చెందామని హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నదే తమ ఉద్దేశ్యమని హైకోర్టు తెలిపింది. సకాలంలో చార్జిషీట్ దాఖలయ్యేలా చూడటమే తమ ఉద్దేశ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ ఈ నెల 23కి హైకోర్టు వాయిదా వేసింది.