ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ సారి ఇంటర్ మొదటి సంవత్సరం 67.4 శాతం, ఇంటర్ రెండవ సంవత్సరంలో 50.82 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది.ఫస్టియర్ లో బాలికలు 73.88 శాతం, బాలురు 61.75 శాతం మంది పాసయ్యారు.

ఇక సెకండియర్ లో బాలికలు 54.47 శాతం, బాలురు 48.54 శాతం మంది పాసమయ్యారు. మే 22 నుంచి 29 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు 4,13,880 మంది పరీక్షలు రాశారు.

పెరిగిన ఉత్తీర్ణతాశాతం
ఈ సారి అడ్వాన్స్డ్ సంప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణత పెరిగింది. ఫస్టియర్, సెకండియర్ రెండింటిలోనూ ఉత్తీర్ణత శాతం పెరగడం గమనార్హం. ఈ సారి ఫస్టియర్ లో 67.4 శాతం నమోదైంది. 2024లో 63.86 శాతం, 2023లో 62.58శాతం విద్యార్థులు పాసయ్యారు. సెకండియర్ లో ఈ సారి 50.82శాతం పాసైతే,2024లో 43.77శాతం, 2023లో 46.06 శాతం పాసయ్యారు.