ఏప్రిల్‎లో ఐపీఎల్-2021

ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ )-14వ సీజన్ కోసం బీసీసీఐతో పాటు ఫ్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ యేడాది ఐపీఎల్‎ను భారత్‎లోనే నిర్వహిస్తామని బీసీసీఐ చెబుతున్నది. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఐపీఎల్-2021 సీజన్ ఆరంభంకానున్నట్లు తెలుస్తున్నది. టోర్నీ షెడ్యూల్‎పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణ‍ం తీసుకోనుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య సిరీస్‎లో ఆఖరి మ్యాచ్ మార్చి 28న జరుగనుంది. ఏప్రిల్ 11 నుంచి ఐపీఎల్ ప్రారంభించినట్లైతే ఆటగాళ్లకు మంచి విరామం దొరుకుతుందని అధికారి వెల్లడించారు.