జులై 30న గ్రాండ్‌ రిలీజ్ కి రెడీగా ‘ఇష్క్’

హైదరాబాద్ : సౌత్ ఇండియాలోని ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్ల‌లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ ఇటీవ‌ల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూప‌ర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ స‌జ్జాతో ‘ఇష్క్‌` చిత్రాన్ని నిర్మిస్తోన్న విష‌యం తెలిసిందే. నాట్ ఎ ల‌వ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ads

ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌,ట్రైల‌ర్‌, సాంగ్స్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ చిత్రాన్ని జులై30న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌ . మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ బాణీలు స‌మ‌కూరుస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎ. వ‌ర‌ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

తారాగ‌ణం :
తేజ స‌జ్జా, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌
సాంకేతిక బృందం :
డైరెక్ట‌ర్‌ : య‌స్‌.య‌స్‌. రాజు
నిర్మాత‌లు : ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌
స‌మ‌ర్ప‌ణ‌ : ఆర్‌.బి. చౌద‌రి
బ్యాన‌ర్‌ : మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్‌
మ్యూజిక్‌ : మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ : శ్యామ్ కె. నాయుడు
ఎడిటింగ్‌ : ఎ. వ‌ర‌ప్ర‌సాద్‌
ఆర్ట్‌ : విఠ‌ల్ కొస‌నం
లిరిక్స్‌ : శ్రీ‌మ‌ణి
పీఆర్వో : వంశీ-శేఖ‌ర్.