హమాస్ కు తగిన గుణపాఠం చెబుతాం

గాజా : ఈ యుద్ధం కొనసాగుతుంది అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. మాపై కాలు దువ్విన హమాస్ కు తగిన గుణపాఠం చెప్పేంత వరకు వెనుకంజ వేయనున్నారు. ఆదివారం ఆయన టెలివిజన్ ప్రసంగం చేశారు. ఆయన పాలస్తీనాను, హమాస్ ఉగ్రవాదులను తీవ్రంగా హెచ్చరించారు. ఆదివారం గాజా నగరంలో దాదాపు 42 మందిని ఇజ్రాయెల్ పొట్టనపెట్టుకున్నది. ఆదివారం గాజా నగరంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టి మూడు భవనాలను పూర్తిగా నేలమట్టం చేసింది. ఈ వైమానిక దాడిలో కనీసం 42 మంది చనిపోయినట్లు తెలుస్తున్నది.

ads

ఇజ్రాయెల్ -గాజాలో పాలస్తీనియన్ల మధ్య నాలుగో యుద్ధానికి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సంకేతాలు ఇవ్వడంతో కాల్పులు భీకరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు కాల్పుల విరమణకు అంతర్జాతీయ సంస్థలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో టెలివిజన్ ప్రసంగం చేసిన నెతన్యాహు యుద్ధం కొనసాగుతుందని, మాపై యుద్ధానికి దిగిన హమాస్ కు సరైన బుద్ధి చెప్పేంత వరకు ముందుకెళతామని ప్రకటించారు. హమాస్ పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.