ఉద్యోగులకు వేతన సవరణ ఉత్తర్వుల జారీ

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ తో వేతన సవరణ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్కేళ్లను సవరించింది. దీంతో 2018 జులై 1 నుంచి ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అమల్లోకి వచ్చినట్లయ్యింది. ఉద్యోగుల కనీస వేతనం రూ. 19వేలు గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లను కొనసాగించింది.

ads

2018 జులై వరకు ఉన్న డీఏ 30.39 శాతం మూలవేతనంలో కలవనున్నది. 2020 ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు మానిటరీ లబ్ధి చేకూరనుంది. బకాయిలను పదవీ విరమణ సమయంలో ప్రభుత్వం చెల్లించనుంది. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి 31 వరకు బకాయిలు చెల్లింపు చేయనుంది. ఏప్రిల్ , మే బకాయిలను సైతం ఈ సంవత్సరం ప్రభుత్వం చెల్లించనుంది. జూన్ నుంచి ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అందనున్నాయి.