ఐటీ దాడులు..భారీగా నగదు స్వాధీనం

హైదరాబాద్ : యాదాద్రి సహా హైదరాబాద్ చుట్టుప్రక్కల వెంచర్లతో పాటు అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్న నగరంలోని రెండు రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ అధికారులు బుధవారం రైడ్ చేశారు. సోదాల్లో రూ.11.8 కోట్ల నగదు, రూ.1.93 కోట్ల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు. ఈ సంస్థలు గత ఆరేళ్లుగా రూ.700 కోట్ల మేర లెక్కల్లో చూపని లావాదేవీలకు పాల్పడినట్లు ఆధారాలు లభించినట్లుగా సమాచారం. కీలకమైన డాక్యుమెంట్లు, చేతిరాత పుస్తకాలను సీజ్ చేశారు.

ads