సమాజహితం కోరుకునేది పోలీసులే

వరంగల్​ అర్బన్​ జిల్లా : తన కుటుంబ క్షేమం కన్నా సమాజం హితం కోసం నిరంతరం శ్రమించేది పోలీసులేనని ఈస్ట్​జోన్ ఇన్​చార్జి డీసీపీ వెంకటలక్ష్మి తెలిపారు. వరంగల్ పోలీస్ విభాగంలో సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహించిన పదవీ విరమణ చేసిన ఆర్ఎస్సైలు సీహెచ్. మాధవ రెడ్డి, వీ నరేంద్ర చారి, ఎఆర్ ఎస్సైలు యం కుమారస్వామి, పీ రామస్వామి, హెడ్ కానిస్టేబులు పీ బాబు క్రిస్టోఫర్లను పోలీస్ అధికారుల సంఘం అధ్వర్యంలో డీసీసీ వెంకటలక్ష్మి ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.

ads

‘సుదీర్ఘ కాలం పోలీస్ శాఖకు సేవలందించి పదవీ విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు అభినందనలు అన్నారు. ఎన్నో త్యాగాలను చేసి శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమించి విధులు నిర్వర్తించడం ద్వారానే నేడు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ప్రశాంత వాతావరణం నెలకొందని డీసీసీ చెపపారు. పదవీ విరమణ పొందిన మాత్రాన తమ ఆలోచన విధానంలో మార్పు రానీయవద్దన్నారు. పదవీ విరమణ కేవలం వయస్సుకు మాత్రమేనని, నిరంతరం వ్యాయామం, ధ్యానం, యోగ చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చని’డీసీసీ వెంకటలక్ష్మి సూచించారు.

ఈ కార్యక్రమములో అదనపు డీసీసీ భీంరావు, పరిపాలనాధికారి సమ్మయ్య, ఏసీలు గంగాధర్, శ్రీనివాస్ పోలీస్ సంక్షేమాధికారి భాస్కర్, ఆర్.ఐ నగేష్, సీనియర్ అసిస్టెంట్ పర్వీన సుల్తానాతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది మరియు పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.