ఇది సామాన్యుని జీవిత కథ

హైదరాబాద్​ : సమాజంలో ప్రముఖ వ్యక్తుల నిజ జీవితకథలను బయోపిక్‌లుగా వెండితెరపై ఆవిష్కరించడం ఇప్పటి వరకు చూశాం. అయితే ఇందుకు భిన్నంగా తొలిసారిగా ఓ సామాన్యుడి బయోపిక్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు మనుయజ్ఞ. ప్రస్తుతం హీరో సుమంత్‌తో అనగనగా ఒక రౌడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మనుయజ్ఞ.

ads

‘ ఊరికి, ఇంటివాళ్లకి తలనొప్పిగా మారిన ఓ పచ్చి తాగుబోతు ఒక సమయంలో రియలైజ్ అయ్యి ఒక సక్సెస్‌ఫుల్ పారిశ్రామిక వేత్తగా ఎదిగి ఆ సామాన్యుడు అసామాన్యుడుగా నలుగురికి ఎలా ఆదర్శప్రాయంగా నిలిచాడు అనేది కథ. మురళి కున్నుం పురత్ అనే సామాన్య వ్యక్తి జీవితంలోని యదార్థ సంఘటనలతో, ఆయన నిజజీవిత కథతో అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’ అన్నారు దర్శకుడు మనుయజ్ఞ.

డబ్ల్యూఎమ్ మూవీస్ పతాకంపై నిర్మాణం కానున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కేఎమ్ రాజీవ్ .