వైద్య ఆరోగ్యశాఖపై సీఎం సమీక్ష

అమరావతి : వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎం ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీ వీ విజయరామరాజు, ఆరోగ్య శ్రీ సీఈవో ఎ మల్లికార్జున, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.