ఆపన్నహస్తం అందించిన జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు

వరంగల్ అర్బన్ జిల్లా : అటు జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా విద్యావంతులైన యువతకు తోచిన ఆర్థిక సాయం చేస్తూనే, ఇటు మాజీ కార్పొరేటర్ గా డివిజన్లలోని ప్రజల కష్టాలను తీరుస్తున్నాడు గ్రేటర్ వరంగల్ నగర కార్పొరేషన్ 58వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో 40వ డివిజన్ కి చెందిన వహీదా బేగం ఇళ్లు నీటిమట్టం అయ్యింది. వరద నష్టంతో ఇబ్బందులు పడుతున్న వహీదాబేగం బాధను తన కార్యకర్తల ద్వారా తెలుసుకున్న దాస్యం విజయ్ భాస్కర్ వహీదా బేగానికి ధైర్యం కల్పించారు.

ads

స్నేహనగర్ లోని తన కార్యాలయంలో బాధితురాలు వహీదాబేగంకు రూ. 10వేలు ఆర్థిక సాయం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అలాగే భవిష్యత్ లో ఎలాంటి అవసరం ఉన్నా తోబుట్టులా అండగా ఉంటానని బాధితురాలు వహీదా బేగంకు దాస్యం విజయ్ భాస్కర్ భరోసా ఇచ్చారు.

ఇక తన ఇబ్బందులను తెలుసుకుని ఆర్థిక సాయంతో పాటు, మనోధైర్యాన్ని కల్పించిన దాస్యం విజయ్ భాస్కర్ కి బాధితురాలి వహీదాబేగం కృతజ్ఞతలు తెలిపారు. మానవతా దృక్పథాన్ని చాటుకున్న దాస్యం విజయ్ భాస్కర్ కి ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని బాధితురాలు వహీదా బేగం కోరారు.