మాజీ కౌన్సిలర్ దారుణ హ‍త్య

జనగామ జిల్లా : జనగామ జిల్లాలో మాజీ కౌన్సిలర్ దారుణ ‎హత్యకు గురయ్యాడు. జనగామ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ పులి స్వామి ( 54 ) ఉదయం తెల్లవారు జామున జనగామ జిల్లా కేంద్రం నుంచి హన్మకొండ వైపు మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్ ఎదురుగా వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ దారుణం చోటుచేసుకుంది. వాకింగ్ చేస్తున్న పులి స్వామిని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి ఆయుధాలతో అతి కిరాతకంగా దాడి చేసి చంపారు.

అయితే గతంలో పులి స్వామిపై భూవివాద ఆరోపణలు చాలా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ భూవివాదంలో నిన్న కోర్టు నుంచి పులి స్వామికి అనుకూలంగా తీర్పు రావడంతో దుండగులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే హత్య అనంతరం దుంగడులు ఘటనా స్థలంలోనే బైక్ ని వదిలి వెళ్లారు. అతి త్వరలోనే దుండగులను పట్టుకుంటామని ఏసీపీ వినోద్ కుమార్ తెలిపారు.